కొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్‌లో సోమవారం దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ జరిగింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, అలీంకో సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత అక్టోబర్‌లో ఎంపికైన 440 మంది దివ్యాంగులకు రూ. 1. 11 కోట్ల విలువైన 1057 ఉపకరణాలు (బ్యాటరీ ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు వంటివి) పంపిణీ చేశారు.