ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పచ్చదనం వైపు అడుగులు వేయాలని, అందరూ మొక్కలు నాటాలని సింగరేణి సీఎండీ ఎన్. బలరాం పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి 11 ఏరియాల జీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది వనమహోత్సవం సందర్భంగా సంస్థ వ్యాప్తంగా 675 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అధికారులు, ఉద్యోగులంతా వన మహోత్సవంలో పాల్గొనాలని సూచించారు.