రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోవొద్దని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సూచించారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర, బోనస్ పొందాలన్నారు. పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతో కలెక్టరేట్లోని తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని అన్నారు.