ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆర్డీవోలు, తహశీల్దార్లతో కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ లో బుధవారం మాట్లాడారు. జిల్లాలో 323 ఇందిరమ్మ ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని.. అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. తహసీల్దార్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలు పరిశీలించాలన్నారు.