తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-3 పరీక్షను పకడ్బందీగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అన్నారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో గ్రూప్-3 పరీక్ష నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీలలో జరిగే పరీక్షలకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.