పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి ఎస్ గ్రామ పంచాయతీకి చెందిన ఒక వికలాంగుడి కుటుంబంలో వెలుగులు నింపింది. బొల్లి రాము అనే వికలాంగుడు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనే అతని కలను ఇందిరమ్మ ఇండ్ల పథకం సాకారం చేసింది. ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ భాస్కర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వంశీ కృష్ణ, ఇంచార్జ్ ఎంపీవో చెన్నకేశవ. బొల్లి రాముకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు.