సింగరేణిలో పనిచేస్తున్న సులబ్ కాంప్లెక్స్ నిర్వహణ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. సిఐటీయు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కోల్ బెల్ట్ పరిధిలోని సులబ్ కాంప్లెక్స్ కాంట్రాక్టు కార్మికులు తరలివచ్చి పాల్గొన్నారు. సులబ్ కాంప్లెక్స్ నిర్వహణ కార్మికులకు బోనస్ చెల్లించాలని, సిఎంపిఎఫ్ అమలు చేయాలని, వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.