గత ప్రభుత్వం హయాంలో మంజూరైన ట్రైకార్ రుణాల లబ్ధిదారులకు రాజీవ్ యువ వికాసం పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సేవాలాల్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు రాంబాబు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 2021-24 సంవత్సరాలకు సంబంధించి గిరిజనుల దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరించి మండల స్థాయిలో ఇంటర్వ్యూలు నిర్వహించారని అన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు.