భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు జిల్లా హెల్త్ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రుల చికిత్స ధరల పట్టిక (సర్కులర్) శుక్రవారం జారీ చేశారు. గిరిజనుల ప్రాంతాల్లో దరల పట్టికను అందరికీ కనపడే విధంగా ప్రదర్శించాలి అని రక్త పరీక్ష కేంద్రాల్లో, ఆస్పత్రుల్లో సర్కులర్ లో పేర్కొన్న ఆదేశాల ప్రకారం వైద్య ఖర్చులు తీసుకోవాలని, ఎవరైనా అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు వైద్యాధికారి లింగ్యా నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి గొంది వెంకటేశ్వర్లు హెచ్చరించారు