భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో శుక్రవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మనోహర్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అశ్వారావుపేట ఆర్టిఏ యూనిట్ ఆఫీస్ నందు రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంవిఐ మనోహర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నిబందనలు పాటించడం ద్వారా సురక్షితమైన ప్రయాణం చేయవచ్చన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 1వ తేది నుంచి 31వ తేదీ వరకు భద్రత మాసోత్సవాలు నిర్వహించనున్నామని చెప్పారు.