కొత్తగూడెం: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

85చూసినవారు
కొత్తగూడెం: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "రైతు నేస్తం" కార్యక్రమానికి జిల్లాలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్