ధాన్యం సేకరణలో విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చర్యలు తీసుకుంటా మని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ బుధవారం హెచ్చరించారు. చంద్రుగొండ, పాల్వంచ మండలం సోములగూడెంలో ఫిర్యాదులపై విచారణ చేపట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలను సస్పెండ్ చేశామన్నారు. మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని చెప్పారు.