భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. శనివారం సిర్పూర్ కాగజ్ నగర్లో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ డివిజన్ కార్యాలయాన్ని వీరయ్య ప్రారంభించారు. అటవీ సంరక్షణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు.