బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీసు ధర్నా హొరేత్తింది. ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు, విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న దశలవారీ ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.