లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం వద్ద ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ద్విచక్ర వాహనంపై 10 కేజీల బెల్లం, 02 కేజీల పటిక, 05లీటర్ల నాటు సారా తరలిస్తుండగా పట్టుకున్నారు. బైక్ సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ తనిఖీల్లో డీటీఎఫ్ ఎస్ఐ గౌతమ్, ఎక్సైజ్ సిబ్బంది రామకృష్ణ గౌడ్, హబీబ్ పాషా, గురవయ్య, వెంకట నారాయణ, సుమంత్, శ్రావణి పాల్గొన్నారు.