ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఛైర్మన్ పదవిని గిరిజనేతరులకు కట్టబెట్టడం సరికాదని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సురేశ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మీదేవిపల్లిలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఛైర్మన్ పదవిని గిరిజనులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.