గంజాయి అక్రమ రవాణాను నిరోధించినందుకు గాను డీజీపీ డాక్టర్ జితేంద్ర హైదరాబాద్ లకిడికపూల్ లోని వారి కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై జలకం ప్రవీణ్‌కు ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెంలో ఎస్సై ప్రవీణ్‌ను అభినందిస్తూ టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ యాస యుగంధర్, ఐలు జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పు శెట్టి సునీల్ కుమార్ సన్మానించారు.