బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోగల రాజీవ్ నగర్ లో అంగనవాడీ కేంద్రంలో శనివారం సామూహిక సీమంతం నిర్వహించారు. ఐ సి డి ఎస్ పి ఓ రేవతి గర్భిణీలకు ఒడి నింపి పౌష్టికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏ డబ్ల్యు డి టీ విజయ, వై ఎస్ అమృత, బి సంధ్య, ఐటిసి (igo) బృందం నుంచి అభిషేక్, స్వాతి, ప్రశాంతి పాల్గొన్నారు.