వైద్య పరీక్షలు చేయించుకోవాలి

60చూసినవారు
వైద్య పరీక్షలు చేయించుకోవాలి
సికిల్ సెల్ అనీమియా లక్షణాలు ఉంటే సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని భద్రాద్రి జిల్లా పంచాయతీ అధికారి వి. చంద్రమౌళి సూచించారు. పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో ప్రభావం చూపే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్