ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. పాల్వంచ మండలంలోని పునుకుల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ నెల 20 వరకు సదస్సులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీటీ వెంకటేశ్వర్లు ఉన్నారు.