కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ. 18, 500 కోట్ల భారాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసిందని పాల్వంచ బిఆర్ఎస్ అధ్యక్షుడు రాజు గౌడ్ అన్నారు. ఈ ప్రయత్నాన్ని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజల తరఫున ఈఆర్సి ఎదుట ప్రజల గొంతుకను వినిపించి విద్యుత్ చార్జీల పెంపును నిలుపుదల చేసిందని అన్నారు. ఈ సందర్భంగా బుధవారం అంబేద్కర్ విగ్రహం ఎదుట స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరిపారు.