ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని మందులు అందించే గది, రక్త పరీక్ష కేంద్రం, ఇన్ పేషెంట్ వాట్, గర్భిణీ స్త్రీల వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ ను పరిశీలించారు. సూపరింటెండెంట్ రాంప్రసాద్ పాల్గొన్నారు