సీపీఐ పాల్వంచ మండల నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాండు రంగాపురంలో జరిగిన సీపీఐ మండల 19వ మహాసభలో వివిధ సమస్యలపై చర్చించి, డిమాండ్ల సాధనకు తీర్మానాలు చేశారు. అనంతరం నూతనంగా 91 మందితో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా పూర్ణచందర్రావు, సహాయ కార్యదర్శిగా నాగరాజులు తిరిగి ఎన్నికయ్యారు. 39 మందితో కార్యవర్గం, 91 మందితో కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు.