తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్ మాట్లాడుతూ భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాటిని చేర్చారని తెలిపారు.