పాల్వంచ మండలం, కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో శుక్రవారం పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది.దేవస్థాన కార్యనిర్వహణాధికారి రజనీకుమారి ఆదేశాల మేరకు, అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృతాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాలకమండలి చైర్మన్ శ్రీ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు, సిబ్బంది, భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.