పాల్వంచ: కారుణ్య నియామకాలు చేపట్టాలని వినతి

68చూసినవారు
పాల్వంచ: కారుణ్య నియామకాలు చేపట్టాలని వినతి
గత కొన్ని ఏళ్లుగా పాల్వంచ KTPSలో అపరిష్కృతంగా ఉన్న కారుణ్య ఉద్యోగ నియామకాల సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జెన్కో డైరెక్టర్ అజయ్ కు TRVKS అధ్యక్షుడు జాన్సన్ ఆధ్వర్యంలో వినతి పత్రం గురువారం ఇచ్చారు. EPF-GPF, ఆర్టిజన్ కన్వర్షన్, గ్రేట్ చేంజ్, కారుణ్య నియామకాల కోసం ఇంటర్వ్యూ జరిగి 9 నెలలు గడుస్తుందని వారి దృష్టికి తీసుకెళ్లారు. డిగ్రీ అర్హత ఉన్న వారికి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్