నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. పాల్వంచ పట్టణంలో రూ. 2. 65 కోట్ల వ్యయంతో సీసీరోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. 12 కాలనీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని వివరించారు.