జిల్లా సమగ్ర అభివృద్ధికి రోడ్డు, రైల్వే, ఎయిర్, జల రవాణా వ్యవస్థలు అవసరమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం పాల్వంచలో విద్యుత్ ఉప కేంద్రాలు, కార్యాలయాల శంకుస్థాపనలో మంత్రి మాట్లాడారు. భద్రాద్రి రామాలయం అభివృద్ధి, రామాలయం చుట్టూ జాతీయ రహదారులను ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి నల్ల బంగారంతో రాష్ట్రానికే వెలుగులు జిమ్మిన జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.