పాల్వంచ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏడీఈ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మార్కెట్ ఏరియా, గట్టాయిగూడెం, సీతారామపట్నం, కరకవాగు, అయ్యప్ప నగర్, శ్రీనివాస కాలనీ, నవభారత్, శేఖరం బంజర, పాత పాల్వంచ ప్రాంతాల్లో ఉదయం 9: 30 నుంచి 11: 30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు.