పాల్వంచ మున్సిపాలిటీలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని బుధవారం కమిషనర్కు బిఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ బుధవారం వినతి పత్రం అందజేశారు. రోడ్లు, కల్వర్టులు, మిషన్ భగీరథ పైప్ లైన్, వీధి దీపాలు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. బాపూజీ నగర్ లో రెండు కల్వర్టులకు నిధులు విడుదలైన నేటికీ నిర్మించలేదని చెప్పారు. మున్సిపాలిటీలోని సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.