బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల గాంధీనగర్ లో 7 సంవత్సరాల క్రితం సుమారు రూ. 10 లక్షల అంచనాతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనం అసంపూర్తిగా నిర్మించి వదిలేసారని అధికారుల నిర్లక్ష్యమా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా అర్థం కావడం లేదని ఇప్పుడు ఈ భవనం ఊరు మధ్యలో ఉపయోగం లేకుండా పాడైపోతుందని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. కావున అధికారులు స్పందించి ఈ భవనాన్ని వాడకలో కి తేవాలని గాంధీనగర్ శనివారం గ్రామస్తులు కోరుతున్నారు.