సీనియర్ సిటిజన్స్ వారి యొక్క శేష జీవితాన్ని ఆహ్లాదకరంగ గడపాలని న్యాయమూర్తి జి. భానుమతి అన్నారు. బుధవారం ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా కొత్తగూడెం రాంనగర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వృద్ధాప్యం శాపం కాదని, వృద్ధులు తమ జ్ఞానం, అనుభవంతో మన సమాజాన్ని సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత వారి పిల్లలపై ఉంటుందని తెలిపారు.