పాల్వంచలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

4చూసినవారు
పాల్వంచలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు చిహ్నంగా మొక్కలు నాటారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం పాటుపడిన గొప్ప దేశభక్తుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్