పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ గురునాథం, ఏఆర్ఎస్సై అబ్బయ్య లను ఆదివారం భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. గత 40 సంవత్సరాలుగా క్రమశిక్షణతో పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన ఈ ఇద్దరు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.