పాల్వంచ ఆదర్శ-లీడ్ స్కూలు లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

61చూసినవారు
పాల్వంచ ఆదర్శ-లీడ్ స్కూలు లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని ఆదర్శ - లీడ్ స్కూలు లో ఆదివారం ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నాగభూషణం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడటంలో కీలక భూమిక పోషించిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల విశ్వనాథం, అడుసుమల్లి సాయిబాబా, సుధాకర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.