కేటీపీఎస్ లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

82చూసినవారు
కేటీపీఎస్ లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ 5వ దశలో మంగళవారం సాంకేతిక సమస్య కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 250 మెగావాట్ల సామర్థ్యం గల 9వ యూనిట్ లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడటంతో ఉత్పత్తి నిలిపేశారు. మరమ్మతు పనులు చేపడుతున్నామని, బుధవారం నాటికి ఉత్పత్తి అందుబాటులోకి తెస్తామని చీఫ్ ఇంజనీర్ ఎం. ప్రభాకర్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్