నేడు కె. ఎల్. ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

61చూసినవారు
నేడు కె. ఎల్. ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
పాల్వంచ కేఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత కె. లక్ష్మారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాలలో ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నాయని కేఎల్ఆర్ తనయుడు, విద్యాసంస్థల డైరెక్టర్ కాటిరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహిస్తున్న శిబిరంలో పలువురు వైద్య నిపుణులు పరీక్షలు చేస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం 89194 15792 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాసంస్థల డైరెక్టర్ మురళీ ప్రసాద్, ప్రిన్సిపాల్ నర్సింహారావు, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్