ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన మదర్ థెరిస్సాని నేటి యువత ఆదర్శంగా తీసుకొని సేవాభావం అలవర్చుకోవాలని న్యూ లైఫ్ సొసైటీ చైర్మన్ సాలి భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం మదర్ థెరిస్సా 115వ జయంతిని పురస్కరించుకుని పాల్వంచలోని న్యూలైఫ్ సొసైటీ ఆఫీస్ లో మదర్ థెరీసా విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్, యం.డి. మంజూర్ తదితరులు పాల్గొన్నారు.