కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని భద్రాద్రి జిల్లాలో ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రిని కలిసి విన్నవించారు. రాష్ట్రంలో 75 శాతం తోటలు ఉమ్మడి ఖమ్మంలో విస్తరించి ఉన్నాయి. కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మరికొంతమంది రైతులు కొబ్బరి సాగుపై ఆసక్తి చూపుతారన్నారు. భద్రాద్రిలో 1, 757, ఖమ్మం 696 ఎకరాలు సాగవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది.