అధ్వానంగా పాల్వంచ బస్ స్టేషన్

56చూసినవారు
పాల్వంచ బస్టాండ్ కు నిత్యం వందల మంది ప్రయాణికులు వస్తుంటారు. 1978లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించిన బస్టాండ్ నేడు అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరింది. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ బస్ స్టేషన్ చిన్నపాటి వర్షానికే ప్రాంగణం అంతా జలమయం అయింది. రాత్రిపూట ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్