చింతకాని మండలం అనంతసాగర్ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపాన గుర్తుతెలియని వృద్ధుడు(60) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు వందేభారత్ ఎక్స్ప్రెస్ వెళ్తుండగా సదరు వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గరిష్ట వేగంతో రైలు వెళ్తున్న క్రమాన ఈ ఘటన జరగడంతో వృద్ధుడి శరీర భాగాలు ముక్కలైపోయాయి. పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.