ముదిగొండ: బైక్‌ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

76చూసినవారు
ముదిగొండ: బైక్‌ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం- సువర్ణపురం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మంకు చెందిన యువకుడు రోజువారి పని నిమిత్తం జగ్గయ్యపేట కు బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి గాయాలయ్యాయి. రహదారి గుంతలమయంగా ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్