బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోగల గాంధీనగర్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక గాంధీనగర్ ఆటో యూనియన్ కార్యాలయంలో, సారపాక సెంటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సారపాక పంచాయతీ కార్యదర్శి మహేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.