మణుగూరు కోల్ టెస్టింగ్ ల్యాబ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోల్ టెస్టింగ్ ల్యాబ్ సిబ్బంది మంగళవారం ల్యాబ్ ఇన్ చార్జి రవి శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లాబరేటరీ కార్మికుల రక్షణ దృష్ట్యా 3 కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.