జీలుగు పంటను పరిశీలించిన ఏఈఓ

80చూసినవారు
జీలుగు పంటను పరిశీలించిన ఏఈఓ
పినపాక మండలంలోని ఏడూళ్ళబయ్యారం గ్రామపంచాయితీలో రైతులు సాగు చేస్తున్న జీలుగు పంటలను శుక్రవారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీలుగు పంట సాగు చేయడం వల్ల భూమిలోనత్రజని శాతం పెరిగి రైతులు వేసే పంటలకు మరింత బలం చేకూ రుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ముక్కు బాలసుబ్బారెడ్డి, యాగంటి అంకిరెడ్డి, ముక్కు శివాజీరెడ్డి, బట్టా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్