కొమరం వంశీయుల ఆరాధ్య దైవమైన శ్రీ రెక్కల రామక్క జాతరను ఘనంగా జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు భక్తులకు సూచించారు. శనివారం ఆయన అళ్లపల్లి మండలం నడిమిగూడెం గ్రామంలో రెక్కల రామక్క జాతర వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి, జాతర కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హనుమంతరావు, వెంకన్న, కృష్ణంరాజు, నరసింహారావు, వెంకటనారాయణ, బాబు సాయన్న, వెంకట్, సతీష్ పాల్గొన్నారు.