ఆశ్వాపురం మండల పరిధిలో గల మల్లెల మడుగు గ్రామంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ మాట, అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మల్లెల మడుగు 1 కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి 3సంవత్సరాల పిల్లలను గుర్తించి, వారి ఇళ్ళకు వెళ్లి అంగన్వాడీ కేంద్రాలకు రావలసిందిగా ప్రోత్సహిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ ధనలక్ష్మి, అంగన్వాడి టీచర్స్ నాగమణి, తదితరులు పాల్గొన్నారు.