అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామం మెయిన్ రోడ్డు పక్కన 10 లక్షల ఖర్చుతో ఐటీసీ, సిఎస్అర్ నిధులతో నూతనంగా నిర్మించిన బస్ సెల్టర్ ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం బస్ సెల్టర్ ప్రాంగణంలో మొక్కను నాటి ప్రతి ఒక్కరు ఆరోగ్యాంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో ఒక మొక్కని నాటాలని ఏ ఊరు ఐతే మొక్కలతో పచ్చగా ప్రసిద్ధి చెందుతుందో ఆ గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.