రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన గురువారం అశ్వాపురం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం అశ్వాపురం మండలం జగ్గారం గ్రామ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కడారి ముత్తయ్య అనే వృద్ధుడికి గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన ముత్తయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.