బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర్ గ్రామంలో ఆటో యూనియన్ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా బీరెల్లి దుర్గారావు, ఉపాధ్యక్షుడిగా కరీం, ప్రధానకార్యదర్శిగా శనగ బాబు, కోశాధికారిగా ప్రశాంత్ ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు ఆటో యూనియన్ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు డ్రైవర్లు, యజమానులకు ధన్యవాదాలు తెలిపారు.